Site icon NTV Telugu

Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!

Pawan Kalyan

Pawan Kalyan

Varun Tej to Campaign at Pithapuram for Janasena: ఏపీలో ఎన్నికల హడావుడి గట్టిగానే ఉంది. నిన్నటితో నామినేషన్ల గడువు పూర్తి కాగా ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీ జరగనుంది. ఏపీ వ్యాప్తంగా లోక్ సభ సెగ్మెంట్లకు 1102, అసెంబ్లీ సెగ్మెంట్లకు 5960 మేర నామినేషన్ సెట్లు దాఖలు అయ్యాయి. వచ్చిన నామినేషన్ల సెట్లను ఎన్నికల అధికారులు స్క్రూట్నీ చేయనున్నారు. గతంలో కంటే ఈసారి ఇండిపెండెంట్లు, డమ్మీ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే రెండు.. మూడేసి సెట్లు దాఖలు చేసినట్టు చెబుతున్నారు. స్క్రూట్నీ తర్వాత నామినేషన్లు తగ్గనున్నట్టు చెబుతున్నారు. స్క్రూట్నీలో ఓకే అయ్యాక నామినేషన్లను డమ్మీ అభ్యర్థులు ఉపసంహరించుకోనున్నారు. ఇక ఈ నెల 29 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది.

Samantha : పెళ్లి డ్రెస్సును సామ్ ఎంత అందంగా రీమోడలింగ్‌ చేయించిందో చూశారా?

ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ జనసేన తరపున కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఆయన కోసం హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆర్కే నాయుడు, అంబటి రాయుడు, నాగబాబు, జానీ మాస్టర్ వంటి వాళ్లతో పాటు మరికొంతమంది సినీ రంగానికి చెందిన వారు కూడా ప్రచారం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రేపు పిఠాపురంలో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. తన బాబాయ్ కి ఓటు వేసి గెలిపించాలని ఆయన రేపు ఆయన అక్కడి ఓటర్లను అభ్యర్దించనున్నారు. ప్రస్తుతానికి ఆయన ఒక్కరే ప్రచారానికి వెళ్లనుండగా రానున్న రోజుల్లో మరికొంతమంది మెగా హీరోలు సైతం ఈ ప్రచారంలో పాల్గొననున్నారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఈ మధ్యనే ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ఈ క్రమంలో ఇప్పుడు కరుణ కుమార్ డైరెక్టర్ గా మట్కా అనే సినిమా చేస్తున్నాడు.

Exit mobile version