NTV Telugu Site icon

Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి వెళ్లేవాళ్లు ఈ బట్టలే ధరించాలట!

Varuntej Lavanya Wedding

Varuntej Lavanya Wedding

Varun Tej Lavanya Tripathi Wedding Celebrations Dresscode: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల డెస్టినేషన్ మెగా వెడ్డింగ్ నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్యా త్రిపాఠితో బంధుమిత్రుల సమక్షంలో ఏడు అడుగులు వేయనున్నారు. ఇటలీలో వరుణ్ లవ్ పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కుటుంబం ప్లాన్ చేసింది ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఇక ఈ క్రమంలోనే అక్టోబర్ 30, సోమవారం నాడు కాక్ టైల్ పార్టీ జరిగింది, ఈ పార్టీకి అతిధులు అందరూ బ్లాక్ టైతో హాజరు కావాలని కోరారు. ఈరోజు ఉదయం హల్దీ వేడుకలు జరుగగా ఆ తరువాత జరిగిన పూల్ పార్టీలో గెస్టులు అందరూ ఎల్లో, వైట్, పింక్ డ్రెస్సులతో హాజరు కావాల్సిందిగా కోరారు.

Vishnupriyaa Bhimeneni: అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే !

ఇక సాయంత్రం కాసేపట్లో మెహందీ వేడుకలు జరుగనుండగా నిండుగా ఉన్న కలర్ బట్టలు ధరించి హాజరుకమ్మని కోరారు. వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి ఒక్కటి అయ్యే పెళ్లి ముహూర్తం బుధవారం (నవంబర్ 1) మధ్యాహ్నం 2.48 గంటలకు కాగా పెళ్లి ముగిసిన తర్వాత రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి రిసెప్షన్ మొదలు కానుంది. వాటికి కూడా డ్రెస్ కోడ్ నిర్ణయించారు. పెళ్లికి పాస్టెల్స్, రిసెప్షన్ కోసం గ్లిట్జ్ అండ్ గ్లామ్ దుస్తులు ధరించాలని అతిధులను కోరారు. అలా నాగబాబు, పద్మజ కొణిదెల కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్, కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి నవంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు. మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం, స్నేహితులు సహా దాదాపు 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నారని అంచనా.

Show comments