Site icon NTV Telugu

Yadhbhavam Thadhbhavathi: సందీప్ కిషన్ ఆవిష్కరించిన వరుణ్ సందేశ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్!

Varun Sandesh

Varun Sandesh

Varun Sandesh movie first look poster unveiled by Sandeep Kishan!

విభిన్న కథాంశాలు, పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. ప్రస్తుతం ‘యద్భావం తద్భవతి’ పేరుతో ఓ విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇనయ సుల్తానా హీరోయిన్ గా నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ మరింత కొత్తగా కనిపిస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా వరుణ్ ఇందులో ఉన్నారు. పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం సందీప్ కిషన్ మాట్లాడుతూ, ” ‘మైఖెల్’ మూవీ సెట్‌లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా ‘యద్భావం తద్భవతి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. నా ‘మైఖెల్’ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో.. ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురు చూస్తున్నాను. ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. మాస్‌కు రీచ్ అయ్యేలా ఉంది” అని అన్నారు. వరుణ సందేశ్ మాట్లాడుతూ, ”నా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్‌కు థ్యాంక్స్. ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, దర్శకుడి కి థ్యాంక్స్. ఈ అక్టోబర్ వస్తే నా తొలి చిత్రం ‘హ్యాపీ డేస్’ విడుదలై పదిహేనేళ్లు అవుతుంది. నా ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్” అని అన్నారు.

డా. విక్రమ్ భూమి, దాసరి వెంకటేశ్‌ ఈ కథను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మాస్ ప్రేక్షకులు మెచ్చేలా రచించారు. శరత్ శ్రీకంఠం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మిహిరమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. కళ్యాణ్ శ్యామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. షావోలిన్ మల్లేశ్ ఫైట్ మాస్టర్‌గా, ఆర్ఎం విశ్వనాథ్ కుంచనపల్లి ఎడిటర్‌గా, రాజు అడ్డాల ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌గా సురేష్ వర్మ పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

Exit mobile version