Site icon NTV Telugu

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘వరుణ్ డాక్టర్’

దీపావళి సందర్భంగా ఓటీటీలలో పలు కొత్త సినిమాలు దండయాత్ర చేస్తున్నాయి. దీపావళి కానుకగా జీ5 వేదికగా సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, డిస్నీ హాట్‌స్టార్ వేదికగా సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’, అమెజాన్ ప్రైమ్ వేదికగా సూర్య ‘జై భీమ్’ (డైరెక్ట్ ఓటీటీ రిలీజ్) సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల సూపర్ హిట్ అయిన వరుణ్ డాక్టర్ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: సూపర్‌స్టార్‌కు దీపావళి గిఫ్టులు పంపిన పవర్‌స్టార్

శివ కార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన ‘వరుణ్ డాక్టర్’ సన్ నెక్స్ట్, నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో విడుదలైంది. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫేం ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. కామెడీ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రూ.100 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన తొలి చిత్రంగా వరుణ్ డాక్టర్ మూవీ రికార్డు సృష్టించింది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Exit mobile version