Sabari Naa Cheyye Pattukove Song Released: బిజీ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా అనిల్ కాట్జ్ దర్శకుడు. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న క్రమంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు మేకర్స్. అందులో భాగంగా తాజాగా ‘నా చెయ్యి పట్టుకోవే…’ అనే పాటను విడుదల చేశారు. ‘శబరి’ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం… ఐదు భాషల్లో విడుదల చేశారు. ‘శబరి’కి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
Hanuman : 100 రోజుల హనుమాన్.. ఓటీటీలోకి వచ్చినా ఇంకా ఆ థియేటర్లలో సందడి..
ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రెహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమృతా సురేష్ పాడగా ‘శబరి మ్యూజిక్’ ఛానల్ లో విడుదలైంది. ‘నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా… మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా అంటూ సాగుతున్న ఈ పాటను వరలక్ష్మీ శరత్ కుమార్, సినిమాలో ఆమె కుమార్తెగా నటించిన నివేక్ష మీద తెరకెక్కించారు. కొడైకెనాల్ కొండల్లో అందమైన ప్రదేశాల్లో ఈ పాట షూట్ చేశారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని, బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
