NTV Telugu Site icon

Mad Square : మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ రిలీజ్..

Mad

Mad

Mad Square : యూత్ ను ఊపేసిన మ్యాడ్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా అదే టీమ్ నుంచి మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. మొదటి పార్టులో నటించిన నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మరో పాటను కూడా రిలీజ్ చేశారు. వచ్చార్రోయ్ పాటను తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఇందులో వారంతా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

Read Also : Man Of The Match: ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు వీరే

వచ్చార్రోయ్.. మళ్లీ వచ్చార్రోయ్ అనే లిరిక్స్ తో సాగుతోంది. ఈ పాట చాలా హుషారెత్తించేదిగా కనిపిస్తోంది. ఇందులో యాక్టర్స్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. మొదటి పార్టులో మాదిరిగానే ఉంటున్నారు వీరంతా. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది కాబట్టి రెండో పార్టు మీద మంచి అంచనాలు ఉన్నాయి. మరి రెండో పార్టు కూడా పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.