Site icon NTV Telugu

Kabzaa: KGF లాంటి పాట కాదు KGF పాటనే…

Kabzaa

Kabzaa

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి వస్తున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘కబ్జా’ కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి టాలెంటెడ్ స్టార్ హీరోస్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై కన్నడ సినీ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇదేంటి KGF స్టైల్ లో ఉంది అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ని నిజం చేస్తూ KGF లాంటి ఏంటి మరో KGF సినిమానే తీస్తున్నాం అని ప్రతి ఒక్కరికీ నమ్మకం కుదిరే రేంజులో కబ్జా టైటిల్ సాంగ్ బయటకి వచ్చేసింది. ట్యూన్, లిరిక్స్, సింగర్స్ వాయిస్, సెట్స్ వర్క్, ఆర్టిస్టుల లుక్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఒకటేంటి కబ్జా టైటిల్ సాంగ్ లోని ప్రతి ఎలిమెంట్ KGF సినిమాలోని తుఫాన్ సాంగ్ ని గుర్తు చేస్తుంది. అదే బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తున్నప్పుడు KGF సినిమాని గుర్తు చెయ్యకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించాలి కానీ KGFనే గుర్తు తెచ్చే సినిమాని చంద్రు ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలియాలి.

కబ్జా సినిమాని డైరెక్ట్ చెయ్యడమే కాదు ఈ మూవీని కో ప్రొడ్యూసర్ కూడా ఆర్.చంద్రునే కాబట్టి కబ్జా మూవీ ఎందుకు ఇలా ప్లాన్ చేశాడో అతనికి మాత్రమే తెలిసే ఛాన్స్ ఉంది. మేకింగ్ పరంగా పెట్టిన ఖర్చు, లుక్ కోసం ఉపేంద్ర-కిచ్చా సుదీప్ లు పడిన కష్టం స్క్రీన్ పైన కనిపిస్తుంది కానీ అది ఎంతవరకూ కలెక్షన్స్ తెస్తుంది అనేది చూడాలి. ఈ పాన్ ఇండియా సినిమాని తెలుగులో యంగ్ హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నాడు. మార్చ్ 17 పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి కబ్జా మూవీ వస్తుంది మరి ప్రమోషనల్ కంటెంట్ వరకు మాత్రమే KGFని ఫాలో అయ్యారా? లేక సినిమా కూడా అలానే ఉంటుందా అనేది తెలియాలి అంటే మార్చ్ 17 వరకూ ఆగాల్సిందే.

Exit mobile version