Site icon NTV Telugu

Upasana : హోదా కాదు, కీర్తి కాదు.. నన్ను నేను నిలబెట్టిన శక్తి ఇదే

Upasana

Upasana

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడామె ఒక తల్లి, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన, తరచూ విలువైన ఆలోచనలను పంచుకుంటూ అందరికీ స్ఫూర్తినిస్తున్నది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన భావోద్వేగపు పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉపాసన తనను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిన దానికి కారణం వారసత్వం గానీ, వివాహ బంధం గానీ కాదు, కానీ తాను ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బాధలను అధిగమించే శక్తి అని చెప్పుకొచ్చారు.

Also Read : Pawankalyan : OG లో.. పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ అర్థం ఏంటో తెలుసా?

ఆమె మాటల్లో..“నేను ఎవరి దయ వల్ల ఎదగలేదు. ఎన్నిసార్లు పడిపోయిన మళ్లీ లేచి ముందుకు వచ్చాను. నా మీద నాకే నమ్మకం!” అని చెప్పిన ఉపాసన, జీవితంలో ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో వివరించారు. “అసలైన బలం ఆత్మగౌరవం లో ఉంటుంది. అది డబ్బు, హోదా, ఫేమ్‌లలో ఉండదు. అహంకారం గుర్తింపుని కోరుకుంటుంది, కానీ ఆత్మగౌరవం ఎలాంటి శబ్దం రాకుండా గుర్తింపును సంపాదిస్తుంది” అని అన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే ఆసక్తికర ఆలోచనను పంచుకున్న ఉపాసన, “ఒక వ్యక్తిని నిజంగా గొప్పవాడిని చేసే అంశం ఏమిటి? డబ్బు, హోదా, కీర్తి మాత్రమేనా? లేక భావోద్వేగ స్థిరత, ఇతరుల కోసం చేసే సేవ తపన కూడా అంతే ముఖ్యమా?” అని ప్రశ్నించారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version