NTV Telugu Site icon

Poonam Pandey Alive: పూనమ్‌ చావుదెబ్బ.. ఉరుకులు పరుగులు పెట్టిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు

poonam pandey

poonam pandey

UP Police ran behind Poonam Pandey link to Kanpur: శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ చేయబడింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా పూనమ్ ను కోల్పోయాం అని అందులో రాసి ఉంది. కుటుంబ ప్రైవసీని గౌరవించాలని కూడా చెప్పారు. మొదట్లో ఎవరూ నమ్మలేదు, కానీ వార్తా సంస్థలు కూడా ఈ పోస్ట్‌ను ఉటంకిస్తూ వార్తలను ధృవీకరించడమే కాదు, ఆమె మేనేజర్ కూడా వివిధ మీడియా సంస్థలతో మాట్లాడుతూ తన మరణ వార్తను ధృవీకరించారు. అయితే అనేక అనుమానాల నేపథ్యంలో శనివారం, పూనమ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. తాను సజీవంగా ఉందని తెలియజేసింది. తనకు క్యాన్సర్ కూడా లేదని నటి స్వయంగా వెల్లడించింది, అయితే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఇదంతా చేశానని పేర్కొన్నారు.

Poonam Pandey Alive: మనోభావాలు దెబ్బతిన్నాయ్ .. పూనమ్ పాండేపై కేసు పెట్టండి!

అయితే నిన్న పూనమ్ పాండే కాన్పూర్ వాసి అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ముంబైలో ఆమె మృతదేహం ఎక్కడుందో తెలియకపోవడంతో ఒక వేళ కాన్పూర్ తీసుకు వస్తారేమో అని అక్కడి పోలీసులు అలెర్ట్ అయ్యారు. శుక్రవారం, కాన్పూర్ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ బృందాలు పూనమ్ పాండే యొక్క కాన్పూర్ కనెక్షన్ కోసం రోజంతా వెతికినా, ఎటువంటి సమాచారం దొరకలేదు. ఒక రోజు మొత్తం విచారణ చేసిన తర్వాత పూనమ్ పాండేకి కాన్పూర్‌తో ఎలాంటి సంబంధం లేదని తేలిందట. కాన్పూర్‌ నగరంలోని స్థానిక పోలీసులతో పాటు నిఘా విభాగం కూడా నిన్న చురుగ్గా పనిచేసి ఉరుకులు పరుగులు పెట్టింది. పూనమ్ పాండే యొక్క కాన్పూర్ కనెక్షన్ కోసం బృందాలు వారి సంబంధిత మూలాల నుండి వెతుకుతూనే ఉన్నా కానీ ఏమీ తెలియలేదు.

Show comments