Site icon NTV Telugu

Unstoppable: పార్ట్ 2 ప్రోమో వస్తుంది… రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవ్వండి

Unstoppable

Unstoppable

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చాలు కథ కూడా అవసరం లేదు రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అనే మాట టాలీవుడ్ లో వినిపించేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కర్లేదు ఆయన పేరు చాలు ఎలాంటి రికార్డ్ అయినా బ్రేక్ అవుతుందని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఆయన పేరు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో కూడా చిన్న విషయానికే ట్రెండ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ఒటీటీ ఆహాలో బాలయ్య హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో జరుగుతుంది. సీజన్ 2 ఎండ్ కి చేరుకున్న ఈ టాక్ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చాడు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ గా పేరు తెచ్చుకున్న ఈ సీజన్ క్లోజింగ్ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ బయటకి వచ్చినా అది నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ అయితే ఆహా యాప్ నే క్రాష్ అయ్యేలా చేసింది.

ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అని ముందే ఊహించి ఆహా వాళ్లు సర్వర్ లు పెంచినా ఉపయోగం లేకుండా పోయింది అంతలా ఎపిసోడ్ ని చూసిన ఫాన్స్ టాక్ షోస్ వ్యూవర్షిప్ లోనే ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో  “Baap of all episodes Part 1 ki pagilipoye records jathara jarigidndhi. Bheemla Nayak power saakshiga, Badrinath pogaru sakshi ga chepthunnam, part 2 tho sensation definition marchadaniki memu ready. Meeru ready na?” అంటూ ఆహా ట్వీట్ చేసింది. పార్ట్ 2 ప్రోమో బయటకి వస్తే అది యుట్యూబ్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడం గ్యారెంటీ, ఎపిసోడ్ బయటకి వస్తే అది ఆహా వ్యూవర్షిప్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడం గ్యారెంటీ. సో చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు.  

Exit mobile version