NTV Telugu Site icon

Manali Rathod: ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన టాలీవుడ్ బ్యూటీ!

Manali Rathod Baby Girl

Manali Rathod Baby Girl

Tollywood beauty gave birth to a baby girl!

‘గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్‌. ఆమె 2019 నవంబర్‌లో విజిత్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంది. ఆయన బీజేపీ నాయకుడు. వీరిది పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. ఆ మ‌ధ్య కాలంలో మ‌నాలీ ప్రెగ్నెంట్ గా ఉన్న పొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేశాయి. కాగా మ‌నాలీ పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది. జూలై 18న ఆమె పాప‌కి జ‌న్మ‌నివ్వ‌గా ..ఈ విష‌యం ఆల‌స్యంగా సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. దాంతో మ‌నాలీకి అంద‌రూ కంగ్రాట్స్ తెలియ‌జేస్తున్నారు.