యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇటీవల విడుదలైన లవ్ డ్రామా “ఉప్పెన”తో వెండితెర అరంగేట్రం చేసాడు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ రెండో ప్రాజెక్ట్ అయిన ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రోజు ఉదయం దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్‌లో ఈ సినిమా అప్డేట్ ను ప్రకటించారు.
Read Also : అఫిషియల్ : “లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ వచ్చేసింది !
ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో వైష్ణవ్ తేజ్‌తో పాటు గ్రామీణులు, పశువులు, గొర్రెలతో కలిసి అడవిలో నడుస్తుండగా… సూర్యుడు అస్తమించబోతున్నట్లు ఉంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆగస్టు 20న ఉదయం 10:15 గంటలకు లాంచ్ చేస్తామని క్రిష్ ప్రకటించారు. ఈ సినిమాకు జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన “కొండపొలం” నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ విలేజ్ డ్రామాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
