Tillu Square Collections Crossed 125 Crores: 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 125 కోట్లు కలెక్ట్ చేసినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Arvind Dharmapuri: వడ్లకు బోనస్ ఇస్తామన్న సీఎం.. ఇప్పుడు ఆగస్టు అంటున్నాడు..!
నిజానికి ఈ సినిమా రిలీజ్ రోజే నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది, సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షో కి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నానన్నారు. అయితే ఆయన అన్న మాటలే నిజమై ఎట్టకేలకు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు 125 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మరింత ముందుకు వెళుతోంది. ఇక ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ రావడంతో మూడవ భాగాన్ని కూడా తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని రెండో భాగం చివరిలోనే అనౌన్స్ చేశారు. టిల్లు క్యూబ్ పేరుతో ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా పనులు ఎప్పుడు మొదలవుతాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.