ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో చిరు, బాలయ్యల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగుతున్నట్లే కోలీవుడ్ లో కూడా అజిత్, విజయ్ ల మధ్య భారి బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ ఫైట్ 2023 పొంగల్ కి కూడా జరగనుంది. అజిత్, విజయ్ ఫాన్స్ తమ హీరో సినిమా హిట్ అవుతుంది అంటే కాదు కాదు తమ హీరో సినిమానే హిట్ అవుతుంది అంటూ గొడవ పడుతున్నారు. రిలీజ్ డేట్, పోస్టర్స్, సాంగ్స్, యుట్యూబ్ రికార్డ్స్ ఇలా ప్రతి విషయంలో పోటీ పడుతూ విజయ్, అజిత్ ఫాన్స్ బాక్సాఫీస్ ఫైట్ ని సినిమాల నుంచి సోషల్ మీడియా వరకూ తెచ్చారు. ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా అజిత్. విజయ్ ఫాన్స్ చేస్తున్న రచ్చ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకరిని ఒకరు ట్రోలింగ్ చేసుకుంటూ అభిమానులు పడుతున్న తంటాలు చూసి ‘తునివు’ డైరెక్టర్ హెచ్.వినోద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
Read Also: Varasudu: మెగా-నందమూరి దెబ్బకి ఈ సినిమా సైలెంట్ అయినట్లేనా?
ఒక సినిమాకి ఎంత వరకూ టైం స్పెండ్ చెయ్యాలో అంతే టైం స్పెండ్ చెయ్యండి, అనవసరంగా టైం వేస్ట్ చెయ్యకండి అంటూ సలహా ఇచ్చాడు. ఏ మూవీ అయినా రిలీజ్ అవుతుంది అంటే దానికి సంబంధించిన సాంగ్స్, టీజర్, ట్రైలర్లు బయటకి వస్తాయి. అవి చూడండి, రిలీజ్ డేట్ ని నాలుగు రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి నచ్చిన సినిమా టికెట్ బుక్ చేసుకోండి. థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి, ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది. అంతే కానే అనవసరంగా ఎక్కువ టైం వేస్ట్ చేసి, సినిమాని చాలా సీరియస్ గా తీసుకోకండి అంటూ అందరికీ హితబోధ చేశాడు. తమ సినిమాలు చూడండి అని చెప్పే దర్శకులు ఉన్న సమయంలో, సినిమాకి ఎక్కువ టైం స్పెండ్ చెయ్యకుండా… రిలీజ్ రోజు టికెట్ బుక్ చేసుకోని వెళ్లి చూసి వచ్చేయండి అంతకన్నా ఎక్కువ సమయం వచ్చించాల్సిన అవసరం లేదు అని చెప్తున్న హెచ్.వినోద్ లాంటి దర్శకులు ఉండడం చాలా అరుదు. అజిత్ కూడా హెచ్.వినోద్ లాగే తన సినిమాలకి ప్రమోషన్స్ ఎక్కువ చెయ్యడు, బయటకి వచ్చి ఇంటర్వూస్ ఇవ్వడు.
