Site icon NTV Telugu

Thufaanu Hecharika : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా “తుఫాను హెచ్చరిక”

Thufaan Hechharika

Thufaan Hechharika

శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ మీద పై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతోంది. జగదీష్ కె కె దర్శకత్వం లో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి “తుఫాను హెచ్చరిక” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసింది యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె కె మాట్లాడుతూ మా ‘తుఫాను హెచ్చరిక’ ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక అందమైన హిల్ స్టేషన్ లో ఆహ్లాదంగా జీవించే ఒక అబ్బాయి జీవితంలోకి ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదురుకున్నాడు మరియు ఎలా విజయం సాధించాడు అనేది కథ అని అన్నారు.

నటీనటులు, టెక్నిషియన్స్ మా సినిమాకి ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్ అందరూ అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి, చింతపల్లి లాంటి అందమైన లొకేషన్స్ లో ప్రకృతి అందాల్లో సరైన విజువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉంది సరైన అందాలను చిత్రీకరించామని ఆయన అన్నారు. ఈ సినిమాకి అరుణ్ వీర్ మాటలు అందించగా విఆర్కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. జగదీష్ కెకె ఎడిటర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి బత్తుల శివ సాయి కుమార్ ఆర్ట్ డైరెక్టర్. లిరిక్స్ – శ్రీమణి, ధర్మ గూడూరు అందించిన ఈ సినిమా విడుదలకి రెడీ అవుతోంది.

Exit mobile version