NTV Telugu Site icon

Surya Kiran: చనిపోయిన సూర్య కిరణ్ ను తరిమి తరిమి కొట్టిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి.. ఎందుకో తెలుసా?

Ravi Kumar Chowdary Attacks Suryakiran

Ravi Kumar Chowdary Attacks Suryakiran

Throwback Ravi Kumar chowdary attacks suryakiran : బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి నటుడిగా కొన్ని సినిమాలు చేసి దర్శకుడిగా మారి కొన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాలు చేశారు సూర్య కిరణ్. తెలుగులో ఆయన సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్ 6 వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న అరసి అనే సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే సూర్య కిరణ్ గత కొంత కాలంగా ఆయన పచ్చ కామెర్లతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. గతంలో హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సూర్య కిరణ్ తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. వారిరువురికి విడాకులు కూడా అయ్యాయి.

Shivam Bhaje: ‘శివం భజే’ అంటూ వచ్చేస్తున్న ఓంకార్ తమ్ముడు

ఇక ఆయన మరణ వార్త నేపథ్యంలో తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందినవారు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఏఎస్ రవికుమార్ చౌదరి తాను సూర్య కిరణ్ ని తరిమి తరిమి కొట్టాను అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఏ ఎస్ రవికుమార్ చౌదరి గురువు దర్శకుడు సాగర్ చనిపోయిన సమయంలో ఆవేదనతో తాను సూర్య కిరణ్ మీద దాడి చేసినట్లు ఏ ఎస్ రవికుమార్ చౌదరి చెప్పుకొచ్చారు. తన గురువు సాగర్ ని మందుకు బాగా అలవాటు చేసి ఆయన ప్రాణం పోయేదాకా సూర్యకిరణ్ పరువు పోయేదాకా తాగారని తన గురువుకి అలా చేయడం తనకు బాధ అనిపించి అతని బాగా కొట్టానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పకొచ్చారు. ఇంటర్వ్యూ పాతదే అయినా ఈ కామెంట్స్ ఇప్పుడు మరోమారు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం సూర్య కిరణ్ మందుకు బాగా అలవాటు పడ్డాడని అర్ధం అవుతోంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Show comments