Theppa Samudram getting Huge Collections: “బిగ్ బాస్” ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘తెప్ప సముద్రం’ ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు వచ్చింది. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీ మణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా, రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి పి. ఆర్(పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడు ఇక తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాల్లో దిగ్విజయంగా ప్రదర్శించ బడుతోందని సినిమా యూనిట్ వెల్లడించింది. వాస్తవ సంఘటనలతో.. అనేక మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది.
Sabari: ‘నా చెయ్యి పట్టుకోవే..అంటున్న వరలక్ష్మి శరత్ కుమార్
ఈ సినిమా విడుదలయిన మూడు రోజుల్లో రూ.2.25 కోట్లు వసూలు చేసి… బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది అని నిర్మాత నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ తెలిపారు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని ఇందులో లీడ్ రోల్ పోషించిన అర్జున్ అంబటి, హిరోయిన్ కిషోర్ దాత్రిక్, చైతన్య రావుల నటనను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. అలాగే లాయర్ విశ్వనాథ్ పాత్రలో రవిశంకర్ పోషించిన పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచిందని తెలిపారు. కొన్ని వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అన్నారు. దర్శకుడు సతీష్ రాపోలు ఎంచుకున్న కథ కథనాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయని నిర్మాత వెల్లడించారు.
