Site icon NTV Telugu

The Family Star: ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కి రప్పిస్తున్న పరశురామ్!

Family Star (2)

Family Star (2)

Theatres see families after a long time for Parasuram’s Family Star: ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల తన ప్రత్యేకతను ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి చాటుకుంటున్నారని చెప్పాలి. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. నిజానికి క్రిటిక్స్ అందరూ సినిమా గురించి మిశ్రమంగా స్పందించారు. అయితే అందుకు భిన్నంగా బుకింగ్స్ గట్టిగా నమోదవుతున్నాయి.

The Family Star: ఈ పని చేస్తే, మీ ఇంటికే “ఫ్యామిలీ స్టార్” టీమ్!

నిజానికి ఈ మధ్యలో ఇటీవల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. కరోనా తరువాత వారిని థియేటర్లకు రప్పించడం చాలా కష్టం అవుతోంది. ఈ టైమ్ లో మళ్లీ తన ఫ్యామిలీ స్టార్ మూవీతో సకుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తున్నారు పరశురామ్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోందని చెప్పచ్చు.. గతంలో శ్రీరస్తు శుభమస్తు, సోలో, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించారు డైరెక్టర్ పరశురామ్. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో పరశురామ్ రూపొందించిన ఫ్యామిలీ స్టార్ కూడా ఈ దర్శకుడు సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలుస్తోంది.

Exit mobile version