అమెరికా ప్రముఖ టెలివిజన్ షో దివైర్ సిరీస్ నటుడు మైఖేల్ కె విలియమ్స్ (54) మృతి చెందారు. రెండు రోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆయన స్నేహితుడు ఆపార్ట్ మెంట్ కు వెళ్లి చూసే సరికి మైఖేల్ శవంగా కనిపించాడు. ఆయన పక్కన డ్రగ్స్ విపరీతంగా ఉండటంతో ఆకారణంగానే చనిపోయి ఉంటాడని అధికారులు నిర్దారణకు వస్తున్నారు. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే మృతి చెందినట్లు భావిస్తున్నారు. మైఖేల్ స్నేహితుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
2002 – 2008 మధ్య అమెరికా కేబుల్ నెట్ వర్క్ అయిన హెచ్‌బీఓలో దివైర్ టెలివిజన్ సిరీస్ ప్రసారమైంది. డ్రగ్ డీలర్ పాత్రలో ఓమర్ లిటిల్ గా ఆయన ఒక్కసారిగా వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. లవ్ క్రాఫ్ట్ సిరీస్ లో విలియమ్స్ ఉత్తమ నటనతో 2021 ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు.
