NTV Telugu Site icon

Maya S. krishnan : హాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న కోలీవుడ్ భామ.. ఇంతకీ ఎవరామే..?

Maya

Maya

మీటూ ఉద్యమం సమయంలో మాయ ఎస్ కృష్ణన్ పేరు మారు మోగింది. మళ్ళి ఇప్పుడు తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆ ఉద్యమంతో కాదులెండి. లాస్ ఏంజెల్స్ లో జరిగిన 2025 ఆస్కార్ రెడ్ కార్పెట్‌కు తన యూనిక్ స్టైల్ తో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన స్టైలిస్ట్ పోషెన్ తో కలిసి పని చేయనుంది ఎస్ కృష్ణన్. హాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్టర్‌గా పోషెంకో, ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్టీవ్‌తో కలిసి మాయా ఎస్ కృష్ణన్‌ను ఓ ప్రత్యేక ఫోటోషూట్‌కు ఆహ్వానించాడు. ఈ సహకారంపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఇది మాయాకు అంతర్జాతీయంగా మరిన్ని గొప్ప అవకాశాలు అందించనుందని తెలుస్తోంది. అలాగే మాయా త్వరలో పారిస్, లాస్ ఏంజిలెస్‌లోనూ ఆడిషన్లకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2021లో ఫ్రెంచ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ (జవాన్, ఫ్యామిలీ మ్యాన్, మావీరన్ ఫేమ్ అయిన యానిక్ బెన్ దర్శకత్వంలో) చేసిన అనుభవమే దీనికి కారణమా? అనే చర్చ కూడా నడుస్తోంది.

మాయా ఎస్ కృష్ణన్, తెలుగు చిత్ర పరిశ్రమలోకి “ఫైటర్ రాజా” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, కొత్త దర్శకుడు కృష్ణ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ఈ రొమాంటిక్ కామెడీ, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో భాగమవ్వడం తనకు గర్వకారణమని, మాయా వెల్లడించారు.  మాయా నటనలోనే కాదు, యూట్యూబ్ స్కెచ్ కామెడీ ద్వారానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె సృష్టించిన “మంజుల” అనే క్యారెక్టర్ గడిచిన కొన్ని నెలల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనివల్ల ఆమెకు భారీగా ఫాలోయింగ్ పెరిగి, డిజిటల్ ప్రపంచంలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా, సంగీతం, ఫ్యాషన్‌లో తనదైన ముద్ర వేసినప్పటికీ, మాయా మాత్రం రంగస్థలంంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. భారతదేశంలో ప్రముఖ థియేటర్ సంస్థలతో అనేక విజయవంతమైన ప్రదర్శనలిచ్చిన మాయా, ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత థియేటర్ గ్రూపులైన Théâtre du Soleil, Les Hommes Approximatifs వేదికలపై తన ప్రతిభను ప్రదర్శించి అంతర్జాతీయ గుర్తింపు సాధించారు.