అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘జోకర్’ సినిమా 2019లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ లో జోకర్ సినిమా వన్ బిలియన్ డాలర్స్ రాబట్టి వరల్డ్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన టాడ్ ఫిలిప్స్ గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. ‘జోకర్’ జియోక్విన్ ఫీనిక్స్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి క్విన్‌గా ‘లేడీ గాగా’ ఫస్ట్ లుక్ ని టాడ్ ఫిలిప్స్ రిలీజ్ చేశాడు. డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ అప్‌లోడ్ చేసిన ఫోటోలో జోక్విన్ ఫీనిక్స్ ప్లే చేసిన ‘జోకర్’తో పాటు గాగా ఒక వాల్ కి ఆనుకుని నిలబడి ఉంది. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ, ఫిలిప్స్ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
దర్శకుడు ఫిలిప్స్, లేడీ గాగాతో కలిసి పనిచేయడం ఇది రెండోసారి. వీరిద్దరు గతంలో ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’ చిత్రంలో కలిసి పనిచేశారు. లేడీ గాగా రావడంతో జోకర్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా జోకర్ 2 ఉంటాడని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లేటెస్ట్ గా జోకర్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యిందని DC ట్వీట్ చేసింది. లేడీ గాగా, జియోక్విన్ ఫీనిక్స్ ఫోటోలని పోస్ట్ చేస్తూ “That’s a wrap!” అని DC అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకోని జోకర్ 2 సినిమా అక్టోబర్ 4న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి పార్ట్ 1తో పది వేల కోట్లు రాబట్టిన జోకర్ ఫిల్మ్ యూనిట్, జోకర్ 2తో వరల్డ్ వైడ్ ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడతారో చూడాలి.
That’s a wrap! #JokerFolieADeux pic.twitter.com/A3LEeop4jd
— DC (@DCOfficial) April 5, 2023
