Site icon NTV Telugu

Tharun Bhascker: వాళ్ళని కొట్టాలి అంటున్న తరుణ్ భాస్కర్!

Tarun Bhasker

Tarun Bhasker

Tharun Bhascker about plagiarism trolls on Tollywood films: పెళ్లిచూపులు ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన తెలంగాణ యాసలో ఎక్కువగా సినిమాలు చేస్తూ యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమా దర్శకత్వం మీద తక్కువ దృష్టి పెడుతున్నాడో లేక దర్శకులు ఆయనని తమ సినిమాల్లో నటించమని అడుగుతున్నారో తెలియదు కానీ ఎక్కువగా ఆయన ఇతర దర్శకులు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడం కీలకపాత్రలలో నటించడం కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ఆయన తాజాగా కీడా కోలా అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

Salaar Teaser: ఏయ్.. బాబు.. త్వరగా పడుకోవాలి.. పొద్దునే లేవాలి కదా

ఈ సినిమాతో ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను టార్గెట్ చేశాడు తరుణ్ భాస్కర్. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే క్రైమ్అండ్ కామెడీ సినిమాగా ఉండబోతుందని క్లారిటీ చేశారు. అలాగే కూల్డ్రింక్స్ తయారీకి పురుగుల మందుకు మధ్య ఏదో కనెక్షన్ ఉందని టైటిల్ విన్నా, టీజర్ చూసినా క్లారిటీ వచ్చేస్తోంది. ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, చైతన్యరావు, రాహుల్, గాంధీ మయూర్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తరుణ్ భాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా పోస్టర్లో ఒక గన్ ఉండగానే ఇది ఫలానా పోలీస్ సినిమాకి కాపీ, బ్యాట్ ఉండగానే ఇది జెర్సీ సినిమాకి కాపీ అని అనవసరంగా కామెంట్లు చేసే వాళ్ళందరినీ మస్తు కొట్టాలనిపిస్తుంది, వాళ్లంతా హౌలే గాళ్లు అని ఆయన కామెంట్లు చేశారు. ఇక ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కీడా కోలా సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version