Site icon NTV Telugu

Thangalaan: ఇదే కదా కావాల్సింది.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తంగలాన్ గ్లింప్స్

Thangalan

Thangalan

Thangalaan glimpse special tribute to ‘Chiyaan’ Vikram: చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. బుధవారం చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ “తంగలాన్” సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూపించింది. అలాగే విక్రమ్ ఎలా తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ వీడియోతో అర్ధం అయిపోతోంది. “తంగలాన్” సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Youtuber Angry Rantman: యూట్యూబ్ సినీ రివ్యూయర్ మృతి

ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ – “తంగలాన్” సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్ తో పాటు మూవీ టీమ్ నాకు ఎంతో సపోర్ట్ చేసిందని, జియో స్టూడియోస్ “తంగలాన్” సినిమా కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉందన్నారు. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నా, హీరో విక్రమ్ “తంగలాన్” సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్ మీకు చూపిస్తుందన్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Exit mobile version