స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..
Also Read : Kantara-Chapter-1 : కాంతార చాప్టర్ 1 నుంచి దీపావళి గిఫ్ట్ రెడీ! ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్‌లో
‘ఈ మూవీ లో నేను చేయబోయే వరుణ్ పాత్ర ప్రేక్షకులను మంత్ర ముగ్ధులు చేస్తుంది. సినిమాలో రక్తం చిందించకుండా, ఎమోషనల్ వార్ మరియు సైకలాజికల్ ఫైట్ చూస్తారు. నా పాత్ర యాక్షన్ సీన్లతో కాకుండా మానసిక శక్తి మరియు భావోద్వేగాల ద్వారా కథను ముందుకు నడిపిస్తుంది’ అని తెలిపారు. సిద్ధు చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే మూవీ లో కొత్త విషయం ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాశి ఖన్నా , శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా.. టీ.జి. విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మాణంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో విడుదలకానుంది . ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడగా.. దీపావళి సందర్భంలో ఈ సినిమా ప్రేక్షకులకి ఎమోషనల్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
