Telugu Film Producers Council Shock to Theatre Owners: తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ప్రదర్శన విషయంలో కొన్ని థియేటర్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే హనుమాన్ సినిమాను నైజాంలో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP టీం “హనుమాన్” సినిమా 12-01-2024 నుండి ప్రదర్శించాలని తెలంగాణాలో కొన్ని థియేటర్ల వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ థియేటర్ల యజమానులు ఆ అగ్రీమెంటును పట్టించుకోకుండా నైజాం ఏరియా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించకుండా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఈ విషయమై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ – హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు ఫిలిం ఛాంబర్ సహా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.
Dil Raju: ‘గుంటూరు కారం’కి నెగిటివ్ టాక్.. దిల్ రాజు ఏమన్నారంటే?
థియేటర్లు అగ్రీమెంటు ప్రకారం “హనుమాన్” సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం జరిగింది కాబట్టి ఈ థియేటర్లు వెంటనే “హనుమాన్” సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. థియేటర్ల వాళ్లు చేసే ఇటువంటి చర్యల వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం, నైతికత, నిబద్ధత, న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఎగ్జిబిటర్లు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ “హనుమాన్” సినిమాకి సత్వర న్యాయం చేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుచున్నదని చెబుతూ ఒక లేఖ రిలీజ్ చేశారు.