NTV Telugu Site icon

TFCC: నంది పురస్కారాల పేటెంట్ ప్రభుత్వానిది.. ఎవరు పడితే వారు ఇవ్వద్దు: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక వ్యాఖ్యలు

Tfcc Prathani

Tfcc Prathani

Telugu Film Chamber of Commerce Releases a press note on Prathani Ramakrishna Goud: నంది పేరుతో ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఎలాంటి పురస్కారాలు ఇవ్వకూడదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది. నంది అవార్డుల పేటెంట్ పూర్తిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉందని అందు వల్ల తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు మాత్రమే ఆ హక్కు ఉంటుందని పేర్కొంది. వచ్చే నెల దుబాయ్ లో జరిగే నంది అవార్డుల వేడుక పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందిందని నోటీసుల్లో పేర్కొన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రైవేటు సంస్థగా, వ్యక్తిగతంగా నంది అవార్డులు ఇస్తున్నారని పేర్కొంది. ఇక నంది పేరుతో అవార్డులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది.

LGM Review: ఎల్.జి.ఎమ్ రివ్యూ

‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్‌ సౌత్‌ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని కొన్నాళ్ల క్రితమే ఈ అవార్డ్స్‌ ఇన్విటేషన్‌ బ్రోచర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు, నటుడు అలీ, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ విడుదల చేశారు. అయితే ఈ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లేదని, నంది వార్డుల పేరుతో జరిగే వేడుకలకు ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి సమాచారం లేదని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రెస్ నాట్ తిలీజ్ చేసింది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫి మంత్రిత్వ శాఖ, ఇరు రాష్ట్రాల చలన చిత్ర అభివృద్ధి సంస్థలు విచారణ జరిపించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నోట్ లో పేర్కొంది.