Site icon NTV Telugu

Ninnu Kori: స్టార్ మా మనసారా “నిన్ను కోరి”

Ninnu Kori

Ninnu Kori

Ninnu Kori: అభిమాన ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న సరికొత్త కథా కథనాల వినూత్న ధారావాహిక “నిన్ను కోరి”. విదేశీ పెళ్లికొడుకుల పైన కలలు; అక్కడి అబ్బాయిల పెళ్లి సంబంధాల గురించి అపోహలు; అసలు నిజాలు, దాచిపెట్టిన వాస్తవాలు తెలిసిన తరవాత తలకిందులవుతున్న అమ్మాయిల జీవితాలు – ఈ సరికొత్త కథకి మూల స్తంభాలు. తెల్లారి లేచింది మొదలు టీవీలో, న్యూస్ పేపర్స్ లో ఇలాంటి విషయాలు వింటూనే వున్నాం, చూస్తూనే వున్నాం. అలాంటి సున్నితమైన భావోద్వేగాల కథ “నిన్ను కోరి”. పరువు ప్రతిష్ట, కుటుంబ గౌరవం కోసం ఎంతో తపన పడే ఒక పల్లెటూరి పెద్ద ఇంట్లో జరిగే సంఘటనల సమాహారం ఈ కథ. ఏ పాత్ర ఏ సందర్భంలో ఎలా స్పందిస్తుందో, ఏ క్యారెక్టర్ ఎంత ధైర్యంగా నిలబడుతుందో.. ఏ క్యారెక్టర్ ఎలాంటి కన్విక్షన్ తో ఉంటుందో.. స్పష్టంగా ప్రతి క్యారెక్టర్ కి ఒక స్పష్టమైన పంథా ఉంటుంది. సందర్భాలు కూడా నిజజీవితం నుంచి వచ్చినవే. ఒక అమ్మాయి జీవితం గురించి, పెళ్లి గురించి ఎలా ఆలోచించాలి, ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి ఎలాంటి అవకాశాల్ని పరిగణన లోకి తీసుకోవాలి, బయటి ప్రపంచాన్ని ఎంత వరకు లెక్కలోకి తీసుకోవాలి.. లాంటి ఎన్నో విషయాలు ఈ కథలో అంతర్భాగంగా ఉండడం ఈ కథ ప్రత్యేకత. జూన్ 3 నుంచి.. మధ్యాహ్నం 12. 30 గంటలకు స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. తప్పక చూడండి.

Exit mobile version