స్టార్ మా “ఇస్మార్ట్ జోడి సీజన్ 3″ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు సరికొత్తగా మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టెలివిజన్ ప్రయోక్త గా, షో నిర్వాహకుడిగా, సినిమా దర్శకుడిగా, వివిధ ప్లాట్ ఫార్మ్స్ లో తనదైన ముద్ర వేసిన ఓంకార్ “ఇస్మార్ట్ జోడి సీజన్ 3″ని మరింత ట్రెండీగా అందించబోతున్నారు. సెలబ్రిటీ జంటలతో ఓ కొత్త ఫార్ములాతో రాబోతోంది “ఇస్మార్ట్ జోడి సీజన్ 3”. ఏదో ఒక ప్లాట్ ఫార్మ్ లో ప్రేక్షకులకు దగ్గరలో వుండే జంటలు సీజన్ 3 కి డిఫరెంట్ లుక్ తీసుకురాబోతున్నారు. ప్రదీప్, సరస్వతి ; అనిల్ జీలా, ఆమని ; అలీ రెజా, మసుమా ; రాకేష్, సుజాత; వరుణ్, సౌజన్య ; యష్, సోనియా ; మంజునాథ, లాస్య ; ఆదిరెడ్డి, కవిత ; అమర్ దీప్, తేజు – ఈ సీజన్ లో పాల్గొంటున్న జంటలు.
Pushpa 2: అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు
వీరు అన్ని తరాలకు ప్రతినిధులు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అందరూ ఈ షో ని హుందాగా పరిపూర్ణమైన కుటుంబ సభ్యులనే భావనను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రేమే పెద్ద పరీక్ష అయితే.. ఆ ప్రేమకే పరీక్ష అంటున్నారు ఓంకార్. ప్రేమ ఓ గమ్యమైతే.. ఆ ప్రయాణానికి పరీక్ష “ఇష్మార్ట్ జోడి సీజన్ 3”. ప్రేమ ఒక తపస్సు అయితే.. ఆ ఏకాగ్రతకి పరీక్ష “ఇష్మార్ట్ జోడి సీజన్ 3”. స్టార్ మా లో ఈ శనివారం రాత్రి 9 గంటలకు “గ్రాండ్ లాంచ్ ఈవెంట్” తో ఈ షో ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.