NTV Telugu Site icon

Illu Illalu PIllalu: స్టార్ మా”లో “ఇల్లు ఇల్లాలు పిల్లలు”!

Illau

Illau

స్టార్ మా” సరికొత్త సీరియల్ “ఇల్లు ఇల్లాలు పిల్లలు”. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథ ఇది. ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ వుంది. అంతే కాదు – మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా వుంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే… ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథ ఏమిటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటో “స్టార్ మా” సరికొత్త సీరియల్ “ఇల్లు ఇల్లాలు పిల్లలు” చెప్పబోతోంది.

AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశ‌పెట్టిన ప్రభుత్వం

ఈ నెల 12 నుంచి రాత్రి 7 . 30 ని. లకు ఈ సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుండి శనివారం వరకు నాన్ స్టాప్ గా ఈ కథ , మనకెంతో పరిచయమైన ట్టుగా అనిపించే పాత్రలు మీ ముందుకు రానున్నాయి. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ. ప్రభాకర్ ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఈ నెల 12 నుంచి రాత్రి 7 . 30 ని. లకు ఈ సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుండి శనివారం వరకు “స్టార్ మా”ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

Show comments