NTV Telugu Site icon

New Actress: హీరోయిన్ అయ్యేందుకు మరో వారసురాలు రెడీ.. ఏమన్నా ఉందా?

Daughter Of Actress Urvashi

Daughter Of Actress Urvashi

Teja lakshmi daughter of actress urvashi getting ready to enter films: నటి ఊర్వశి అనగానే అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తూ మన పక్కింటిలో ఉండేలా ఒకామె మనకు గుర్తుకొస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్గా, ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, అత్త పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మొత్తం 700 పైగా సినిమాల్లో నటించిందట. అవడానికి కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె అయినా తమిళనాడులో సెటిలై, ఎక్కువగా తమిళ్ సినిమాలే చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. తన వారసురాలిగా తన కుమార్ తేజ లక్ష్మి ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధమైందని ఆమెకు 23 ఏళ్లు రావడంతో సినిమాల్లో నటించేందుకు తన ప్రోద్భలం లేకుండా ఆమె అంతట ఆమెనే సిద్దమైనట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు ఆమెను సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కూడా ఒక కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

DCP Rashmi Perumal : టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ.. నిందితులు అరెస్ట్

ఇలా వారసురాళ్ళను వారసులను సినిమాల్లోకి తీసుకొస్తే కేవలం మా ప్రభావం వల్లే వారికి అవకాశాలు వస్తాయి అని చాలామంది భావిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అదే నిజమవుతుంది కూడా. చదువుకోకుండా వచ్చి సినిమాల్లో క్లిక్ అవ్వకపోతే ఇబ్బందులు పడటం ఇష్టం లేదు. అందుకే ఆమె చదువు పూర్తి చేసి రమ్మన్నాను. చదువు ఉంటే సినిమాల్లో క్లిక్ అవ్వకపోయినా తర్వాత ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె చదువు పూర్తి కావడంతో సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించిందని తన సర్కిల్లో ఆమెను హీరోయిన్గా చేసే ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. నిజానికి ఆమె మొదట్లో సినిమాల్లోకి రాకూడదు కానీ ఇప్పుడు ఆమెకే స్వయంగా సినిమాల మీద ఆసక్తి కలగడం అంతా విధి రాసిన రాత అని ఊర్వశి చెప్పుకొచ్చింది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఊర్వశి మొదటి భర్తతో కలిగిన సంతానమే ఈ తేజ లక్ష్మి. ఇప్పుడు ఊర్వశి మరొక వ్యక్తితో వివాహ బంధంలో ఉంది. తేజ లక్ష్మీ తన మొదటి భర్త అయిన మనోజ్ జయన్ వద్ద పెరుగుతోంది. తల్లితో పాటు తండ్రి కూడా నటుడే కావడంతో తేజ లక్ష్మికి కూడా సినిమాల మీద ఆసక్తి ఏర్పడినట్లు కనిపిస్తోంది.