Site icon NTV Telugu

NBK 109: అబ్రార్ మామ దిగుతున్నాడు.. ఇది కదా అసలైన మాస్ కాంబో

Bobby Deol

Bobby Deol

Team NBK 109 Welcomes aboard Bobby Deol: యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కి పర్ఫెక్ట్ విలన్ గా నిలిచాడు బాబీ డియోల్. ఒకప్పుడు బాలీవుడ్లో హీరోగా అనేక సినిమాలు చేసిన ఆయన తర్వాత అవకాశాలు లేక సైలెంట్ అయి పోయాడు. ఈ మధ్యకాలంలో ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ చేసి కాస్త లైమ్ లైట్ లోకి వచ్చాడు అనుకుంటున్న సమయంలో యానిమల్ లో అబ్రార్ పాత్రలో నటించి ఒక్కసారిగా ప్యాన్ ఇండియా లెవెల్ లో మరోసారి వైరల్ అయ్యాడు. నిజానికి యానిమల్ సినిమాలో ఆయన్ని పూర్తి వైలెంట్ గా చూపించారు. కానీ ఎందుకు నటన విషయంలో పూర్తిస్థాయిలో వాడుకోలేదనిపించింది. ఇక యానిమల్ క్రేజ్ తో ఆయనకు పలు సౌత్ సినిమాల్లో అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే సూర్యతో కలిసి చేస్తున్న కంగువ సినిమా నుంచి లుక్ రిలీజ్ చేయగా ఇప్పుడు మరొక లుక్ రిలీజ్ చేశారు.

Bramayugam: ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా మమ్ముట్టి ‘భ్రమయుగం’

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన్ని నటింపచేస్తున్నారని చాలాకాలం నుంచి ప్రచారం జరిగింది. కానీ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా లుక్ రిలీజ్ చేసి సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్కమ్ ఆన్ బోర్డు పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా టీం. నందమూరి బాలకృష్ణకి ఆయన విలన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా రిలీజ్ అయితే గాని అది ఎంతవరకు నిజమైన విషయం మీద క్లారిటీ లేదు. అయితే ఆయన విలన్ పాత్రలో నటించడం నిజమే అయితే బాలకృష్ణకి సమఉజ్జీ అనొచ్చు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version