Site icon NTV Telugu

STR : డేరింగ్ డెసిషన్ తీసుకున్న తమిళ స్టార్ హీరో శింబు

Str

Str

దశాబ్ద కాలం క్రితం మన్మధ సినిమాతో అమ్మాయిల మనసు దోచేసిన లవర్ బాయ్ శింబు. ఇప్పుడు ఫెర్మామెన్స్ బేస్డ్ సినిమాలకు సై అంటోన్నాడు. మన్నాడు, వెందు తన్నిందత్తు కాదు, పట్టుదల సినిమాల్లో మరో లిటిల్ సూపర్ స్టార్ కనిపిస్తాడు. రీసెంట్లీ శింబు తన 42వ బర్త్ డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు మల్టీటాలెంటర్ గా ప్రూవ్ చేసుకున్న శింబు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆత్మన్ సినీ ఆర్ట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన సిలంబరసన్ తన 50వ సినిమాను స్వీయ బ్యానర్ లో  నిర్మిస్తున్నాడు.

Also Read : Ajith Kumar : అజిత్ ముందు బిగ్ టార్గెట్స్.. రీచ్ అయ్యేనా..?

కమల్ హాసన్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై శింబు హీరోగా కనులు కనులు దోచాయంటే ఫేం దేశింగు పెరియసామితో ఓ సినిమా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టుకు కమల్ హ్యాండ్ ఇచ్చాడని టాక్. ఆర్థిక సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోకూడదని ఎంతో మందిని అప్రోచ్ అయ్యాడట హీరో. భారీ బడ్జెట్ కావడంతో చివరకు ఎవరూ ముందుకు రాకపోయేసరికి తనే ప్రొడ్యూసర్ గా మారిపోయాడని రిస్క్ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. శింబు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ థగ్ లైఫ్ రిలీజ్ కు రెడీ గా ఉంది.  శింబు  49 సినిమాగా  పార్కింగ్ ఫేం రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. తన 50వ సినిమాకు దేశింగు పెరియ స్వామిని సెట్ చేసుకున్నాడు. అలాగే అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నాడట. ఇప్పటివరకు నటుడిగా, దర్శకుడిగా, మాటల రచయితగా మల్టీ కేటగిరీస్ లో వర్క్ చేసిన శింబు నిర్మాతగా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.

Exit mobile version