Site icon NTV Telugu

Actor Tej: ‘గాడ్’ తో తమిళ నటుడి టాలీవుడ్ ఎంట్రీ!

God

God

 

‘కొంజుం వెయిల్ కొంజుం మలయ్, కాదలుక్కు మరణం ఇల్లై, గాంతం’ చిత్రాలతో తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ తేజ్ త్వరలో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రతినాయకుడిగా తేజ్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ‘గాడ్’ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. తేజ్ ప్రస్తుతం కన్నడలో ‘రామాచారి -2’లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇదే యేడాది చివరిలో జనం ముందుకు రానుంది. ఇది తెలుగులోనూ డబ్ కాబోతోంది. ‘గ్లోరి ఆఫ్ డెమన్’ అనే ట్యాగ్ లైన్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గాడ్’ చిత్రంలో కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు.

Exit mobile version