Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో ఇప్పటికీ ఛాన్సులు పట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తోంది.
Read Also : Brahmanandam : పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
అదే టైమ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్లను ఊపేస్తోంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ డూ యూ వాన్న పార్ట్ నర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో తమన్నా పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు. ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు చూసేయండి.
Read Also : Mirai : బాహుబలి తర్వాత మిరాయ్ సినిమానే.. ఆర్జీవీ సంచలనం..
