Site icon NTV Telugu

Hyderabad Pub Case: నిహారికను సపోర్ట్ చేసిన తమన్నా.. పబ్‌కు వెళ్లడమే తప్పా?

Niharika

Niharika

హైదరాబాద్‌లో పబ్ వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. ఇటీవల బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్‌ పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దొరకడంతో పోలీసులు సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే అదే పబ్‌లో నిహారిక ఉండటంతో విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి స్పందించారు. ఎవరో ఒకరు తప్పుచేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారని తమన్నా సింహాద్రి మండిపడ్డారు. పబ్‌కు వెళ్లడమే తప్పు అనే విధంగా నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిహారిక ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసమే పబ్‌కు వెళ్లిందన్నారు.

పబ్‌కు వెళ్లిన మిగతా వారిని వదిలేసి కేవలం నిహారికని టార్గెట్ చేసి మీడియా, యూట్యూబ్‌లో స్టోరీస్ వేస్తున్నారని.. ఇది దారుణమని తమన్నా సింహాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు చెప్పలేదన్నారు. నిహారిక ఫ్యామిలీ విషయాలపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారన్నారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని.. మెగా ఫ్యామిలీ అభిమానులుగా ట్రోల్ చేసిన వారిని అడ్డుకుంటామని ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హెచ్చరించారు.

https://ntvtelugu.com/akhanda-world-television-premiere-on-april-10th/

Exit mobile version