Site icon NTV Telugu

Lust Stories 2: బాబోయ్.. సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారుగా!

Lust Stories

Lust Stories

అరె.. సీతారామం సినిమాలో చూసిన సీతనేనా మనం చూస్తున్నది.. ఆమె టాలీవుడ్ హీరోయిన్ తమన్నానేనా? అనేలా సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారు తమన్నా అండ్ మృణాల్ ఠాకూర్. గత రెండు మూడు రోజులుగా ఈ ఇద్దరు బ్యూటీల హాట్ క్లిప్స్ ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నాయి. నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అసలు వీళ్లు చేసిన సినిమాలు ఏంటి.. చేస్తున్న వెబ్ సిరీస్‌లు ఏంటి? అంటూ రెచ్చిపోయేలా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈమె మా సీతనే కాదు.. ఆమె తమన్నానే కాదని అంటున్నారు. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌లో వరుస వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్‌గా తమన్నా నటించిన ‘జీ కర్థ’ అనే వెబ్ సిరీస్ సంచలనంగా నిలిచింది. ఈ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది తమన్నా. ఇక ఈ వేడి చల్లారకముందే.. మరో సెన్సేషన్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ ముందుకి వచ్చేసింది. లస్ట్‌ స్టోరీస్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన లస్ట్ సోరీస్2.. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఈ సిరీస్‌లో.. తన ప్రియుడు విజయ్‌ వర్మతో కలిసి రెచ్చిపోయింది తమన్నా. ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ వీడియో క్లిప్‌లను కట్ చేసి.. ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఇక ఇదే సిరీస్‌లో తమన్న, కాజోల్, కొంకణా శర్మతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా ఒక ఎపిసోడ్‌లో నటించింది. ఈ బ్యూటీ కూడా లస్ట్ స్టోరీస్‌ 2లో రెచ్చిపోయినట్టుగా కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమెకు సంబంధించిన ఓల్డ్ బెడ్ రూమ్ సీన్ ఒకటి సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. ఇక ఈ సిరీస్ పై మృణాల్ చేసిన హాట్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. సెక్స్ అండ్ లస్ట్ గురించి తమ ఇంటిలోని యుక్త వయసులో ఉన్న పిల్లలతో మాట్లాడటం ఎంతో అవసరం.. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించాలి.. అని చెప్పుకొచ్చింది. మొత్తంగా.. కామెంట్స్‌తోను ఈ హాట్ బ్యూటీలు కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్నారు.

Exit mobile version