Site icon NTV Telugu

Swapnaala Naava: సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అంకితమిస్తూ ‘స్వప్నాల నావ’

Swapnaala Naava

Swapnaala Naava

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా ఓ పాటని ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా సిద్ధం చేస్తున్నారు. ఈ పాటకు పార్ధసారధి నేమాని స్వరాలు సమకూర్చగా.. యశ్వంత్ సాహిత్యం అందజేశారు. ప్రముఖ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య సాంగ్ షూట్ చేశారు. ఇక ఈ మ్యూజిక్ వీడియోకి బుజ్జి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పూర్తిగా అమెరికాలోని డల్లాస్‌ నగరంలో చిత్రీకరించిన స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భగా జరిగిన వీడియో లాంచ్ కార్యక్రమంలో నిర్మాత గోపీకృష్ణ కొటారు, కుమారి శ్రీజ కొటారును అభినందించారు. డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపీ కృష్ణ కొటారు .. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదటి ప్రయత్నంగా తన కుమార్తె శ్రీజ కొటారు పాడి, నటించిన ‘‘స్వప్నాల నావ’’ వీడియో చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఎన్నిసార్లు కిందపడితే అంతగా మనిషి పైకి వస్తాడన్నారు. ‘‘స్వప్నాల నావ’’ పాటను వీలైనంత త్వరగా చిత్రీకరణ జరిపి మీ ముందుకు తీసుకొస్తామని ఆదిత్య వెల్లడించారు.

Exit mobile version