NTV Telugu Site icon

Swag Twitter Review : స్వాగ్ ట్విట్టర్ రివ్వూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టేశాడట

Whatsapp Image 2024 10 04 At 8.41.42 Am

Whatsapp Image 2024 10 04 At 8.41.42 Am

Swag Twitter Review : యంగ్ హీరో శ్రీ విష్ణు, సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య నటించిన సినిమా స్వాగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రాజ రాజ చోర మూవీ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించారు. అచ్చ తెనుగు సినిమా అనే టైటిల్‌తో ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల గురించి తెలుసుకుందాం. టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాకు ఇప్పుడు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. సింగ క్యారెక్టర్ హిలేరియస్ అని, మిగిలిన మూడు పాత్రలు కూడా అదిరిపోయాయని అంటున్నారు.

స్వాగ్ కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రం. దర్శకుడు హసిత్ గోలి మంచి కాన్సెప్ట్‌ను మంచి స్క్రీన్ ప్లేతో ఎలాంటి లోపాలు లేకుండా తెరకెక్కించారని తెలుస్తోంది. నాలుగు విభిన్నమైన పాత్రలతో.. నాలుగు తరాలకు సంబంధించిన ఆ క్యారెక్టర్లకు తగినట్టుగా డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నారు. శ్రీ విష్ణు అద్బుతంగా పెర్ఫార్మెన్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్వాగ్ సినిమా చూశాను. శ్రీ విష్ణు తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు కలెక్షన్లతోపాటు అవార్డు కూడా రావడానికి అవకాశం ఉన్న సినిమా. హసిత్ గోలి తెలుగు సినిమాకు దొరికిన వరం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇది శ్రీ విషు గాడి సినిమా, ఇది హసిత్ గోలి సినిమా. ఇండియన్ సినిమాలో ఓ డేరింగ్ అటెంప్ట్. ఐదు డిఫరెంట్ టైమ్ లైన్‌లో ఐదు డిఫరెంట్ స్టోరీలతో హసిత్ గోలి అద్బుతంగా తెరకెక్కించారు. ఈ అచ్చ తెలుగు సినిమాను చూసి గర్వపడుతున్నాను అని ఓ నెటిజన్ అన్నాడు.

Show comments