Site icon NTV Telugu

Gana Movie First Look: ‘గణా’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి

Gana First Look Released

Gana First Look Released

SV Krishna Reddy Releases Gana Movie First Look: రాధా మమతా సమర్పణలో ఎస్.కె. ఆర్ట్స్ పతాకంపై విజ‌య్ కృష్ణ హీరోగా న‌టిస్తూ.. స్వీయ ద‌ర్శక‌త్వంలో నిర్మించిన చిత్రం ‘గ‌ణా’. సుక‌న్య, తేజు హీరోయిన్స్‌గా న‌టించారు. ఎస్వీ క్రిష్ణారెడ్డి ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ’విజయ క్రిష్ణా రెడ్డి అనే ఒక వ్యక్తి కృషి తో, పట్టుదలతో, దీక్షతో గ‌ణా చిత్రాన్ని రూపొందించారు. అంతే కాదు హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ చేశారు. ఎంతో మంది వ్యక్తులు సహకరించడం వల్లనే ఇది సాధ్యం. నా చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.

హీరో విజయ్ క్రిష్ణ మాట్లాడుతూ ‘నాకు ఎస్వీ క్రిష్ణారెడ్డిగారు ఆదర్శం. గతంలో దుర్మార్గుడు, గోవిందా భజగోవింద సినిమాల్లో ప్రధాన పాత్రలు చేశాను. పాగల్ వంటి పలు చిత్రాల్లో విలన్ గా కూడా చేశాను. హీరోగా గణా నా మూడో సినిమా. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలిసారి డైరెక్టర్ గా చేశాను’ అని తెలిపారు. ఇంకా పలువురు ‘గణా’ పోస్టర్ చాలా బాగుందని, సినిమా కూడా అంతకంటే బాగుంటుందంటూ సినిమా ఘనవిజయం సాధించాలన్నారు.

Exit mobile version