కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తాజా చిత్రం “ఎతర్క్కుం తునింధవన్”తో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటుడు సూర్యకు ప్రేమగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
Read Also : Boyapati Srinu : మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లానింగ్… తెలుగు హీరోతో కాదు !!
ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు రానా, సురేష్ బాబు, బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ “నేను మీలో ఒకడిని. మిమ్మల్ని కలవక దాదాపుగా రెండేళ్లకు పైగా అయిపోతోంది” అంటూ అభిమానులకు, చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని, ఆయన బ్లడ్ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవల నుంచి స్ఫూర్తి పొందిన తాను ‘అగరం’ ఫౌండేషన్ ను స్థాపించి, సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. సూర్య ఆసక్తికర స్పీచ్ ను ఈ వీడియోలో వీక్షించండి.
