Site icon NTV Telugu

Sundarakanda : రొమాంటిక్‌ కామెడీ ‘సుందరకాండ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Sundarakanda

Sundarakanda

టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘సుందరకాండ’  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘని కథానాయికలుగా నటించారు. ‘‘ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు’’ అన్న కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాంటిక్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

కాగా ఈ నెల 23నుంచి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. కథ సారాంశం కనుక చూసుకుంటే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సిద్ధార్థ్ (నారా రోహిత్) ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. కారణం – తనకు నచ్చిన ఐదు లక్షణాలు ఏ అమ్మాయిలోనూ కనిపించకపోవడం. స్కూల్‌ డేస్‌లో తన సీనియర్ వైష్ణవిలో (శ్రీదేవి విజయ్‌కుమార్) చూసిన ఆ క్వాలిటీస్ తనకు జీవిత భాగస్వామిలో కావాలని కోరుకుంటాడు. ఒకరోజు ఎయిర్‌పోర్ట్‌లో ఐరా (వృతి వాఘని)ను కలవడంతో ఆమెలో తనకు నచ్చిన లక్షణాలు గమనిస్తాడు. దీంతో తన విదేశీ ట్రిప్ రద్దు చేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ వారి పెళ్లి విషయంలో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది.

చివరకు ఏమైంది? సిద్ధార్థ్ నిజంగా తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? అన్నది సినిమాకి క్లైమాక్స్. ఇక మొత్తం మీద, సుందరకాండ రొమాంటిక్‌ కామెడీ జానర్‌లో ఒక ఫీల్గుడ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంట్లోనే చూడటానికి మంచి అవకాశం దొరికింది. ఈ నెల 23 నుంచి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్‌ అవుతోంది కాబట్టి, రొమాంటిక్ కామెడీ లవర్స్ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.

Exit mobile version