Site icon NTV Telugu

Varahi: డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ ‘వారాహి’ ఆరంభం

Sumanth Varahi Film

Sumanth Varahi Film

Sumanth New Film Varahi Shooting Started: ఏడు శక్తి రూపాల్లో వారాహి అమ్మవారిని ఒకరిగా కొలుస్తారు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంతో సుమంత్ హీరోగా ‘వారాహి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కలయికలో గతంలో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే సినిమా వచ్చింది. అది మంచి విజయం సాధించింది. వారాహి చిత్రాన్ని జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్నారు.

సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. డి. సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ ‘ఇవాళ మా సినిమా పూజ నిర్వహించాం. సప్త మాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ ‘సంతోష్ కథ చెప్పగానే క్లాప్స్ కొట్టాను. మా కాంబినేషన్ లో వచ్చిన సుబ్రమణ్యపురం కంటే బెటర్ స్క్రిప్ట్ ఇది. ఇటీవల కాంతార, కార్తికేయ 2 చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి ఒక డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా వారాహి ఆకట్టుకుంది’ అన్నారు.

Exit mobile version