Sukumar : స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప-2 తర్వాత రెస్ట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలిన డిసైడ్ అయ్యారు. అందుకే తన కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ వరుసగా ఈవెంట్లు, ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. తాజాగా సీనియర్ హరో కమ్ డైరెక్టర్ అర్జున్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సతాపయనం సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు సుకుమార్.
Read Also : Sai Durga Tej : నీ త్యాగాలు నాకు తెలుసు బాబాయ్.. మనోజ్ పై సాయిదుర్గా తేజ్ పోస్ట్‘
ఇందులో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ వేదిక మీద ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు. ఒకరు అర్జున్, ఇంకొకరు ఉపేంద్ర. వీరిద్దరు యాక్టర్సే కాదు.. బెస్ట్ డైరెక్టర్లు. వాళ్లు సినిమాలు తీసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా సరే ‘ఓం, ఏ, ఉపేంద్ర.. ఈ మూడు సినిమాలు తీసిన తర్వాత రిటైర్ అయిపోవచ్చు. స
ఒకవేళ నేను ఆ మూడు సినిమాలు తీసి ఉంటే మాత్రం ఈ పాటికి కచ్చితంగా రిటైర్ అయిపోయేవాడిని. ఆ సినిమాలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. నా సినిమాల స్క్రీన్ ప్లేలు ఈ రోజు అందరినీ ఆకట్టుకుంటున్నాయంటే అవే కారణం’ అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.
Read Also : JR NTR : విజేతలకు కంగ్రాట్స్.. గద్దర్ అవార్డుల ప్రకటనపై ఎన్టీఆర్..
