Site icon NTV Telugu

STHREE: మహిళా శక్తిని చాటేలా ‘స్త్రీ’ మ్యూజికల్ ఆంథమ్

Sthree Song

Sthree Song

Sthree – The Anthem in Telugu: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి, సామర్థ్యాలను చాటేలా ‘స్త్రీ’ అనే ఓ ఆల్బమ్ శ్రోతల ముందుకు తీసుకు రాబోతున్నారు ప్రముఖ నేపథ్య గాయని శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్‌. ఈ ఇద్దరూ కలిసి ఈ “స్త్రీ” అనే ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఆల్బమ్ నాలుగు భారతీయ భాషలలో విడుదల కానుంది. హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో రానున్న ఈ స్త్రీ ఆల్బమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.

Samantha: ఆ గాయం కంటే ఈ గాయం పెద్దది!

మణిరత్నం ‘బాంబే’, చిత్రంలో ‘కుచ్చి కుచ్చి కునమ్మా..’, ‘ఆడువారి మాటలకు ఆర్థాలే వేరులే..’ చిత్రంలో ‘చెలి చమకు..’ ధనుష్ ‘సార్’ చిత్రంలో ‘మాస్టరూ మాస్టరూ..’ ఆదిపురుష్ చిత్రంలో ‘ప్రియా మిథునం..’, సహా ఎన్నో చిత్రాలో వినసొంపైన పాటలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు గాయని శ్వేతా మోహన్. ఆమె ఇప్పుడు మైత్రి శ్రీకాంత్ కలిసి చేస్తున్న ఈ ఆల్బమ్ మహిళా సాధికారత, స్త్రీ తత్వం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ, సాధికారత సార్వత్రిక సందేశాన్ని అందజేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. స్త్రీ జీవిత ప్రయాణంలో ఎదుర్కొనే పోరాటాలను తెలియజేసేలా మైత్రి శ్రీకాంత్ రాసిన కవిత ‘హర్ కెలిడోస్కోప్’ నుంచి ఈ ‘స్త్రీ’ని రూపొందిస్తున్నారు. “స్త్రీ, ది ఆంథమ్” శ్వేతా మోహన్ అధికారిక యూట్యూబ్ హ్యాండిల్‌లో విడుదల చేశారు.

Exit mobile version