Sriya Reddy about Radha rama Charecter Casting in Salaar Movie: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేస్తూ ముందుకు వెళుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అనేకమంది నటీనటులు కనిపించారు కానీ విశాల్ వదిన, నటి శ్రియ రెడ్డి పాత్ర గురించి మాత్రం సినిమా చూసిన వారందరూ చర్చించుకుంటున్నారు. సినిమాలో రాజమన్నార్ అనే పాత్ర పోషించిన జగపతిబాబు కుమార్తె రాధా రమ అనే పాత్రలో శ్రియ రెడ్డి కనిపించింది. నిజానికి ఆమె ఈ సినిమాలో కనిపించడానికి అంటే ముందు సుమారు ఆరేడేళ్ల ముందు నుంచే సినిమాలు చేయడం ఆపేసింది. అయితే ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి అని అడిగితే ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ముందు నుంచి ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేయమని కోరినప్పుడు తాను చేయలేనని చెప్పానని, ఎన్నోసార్లు అవాయిడ్ చేయడానికి కూడా ప్రయత్నించాక మీరు ఒప్పుకోకపోతే చెన్నై వచ్చయినా సరే మీకు కథ వినిపిస్తానని ప్రశాంత్ నీల్ చెప్పడంతో కథ వినడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది.
Kalyan Ram: రెండు పడవల మీద కాళ్ళు వద్దనుకున్నా.. అందుకే వదిలేశా!
సినిమా చేయడం కంటే ముందు ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేది కానీ ప్రశాంత్ తనకు ఒక మాట ఇచ్చాడని పక్కన ప్రభాస్ ఉన్నాడా? లేక వేరే నటులు ఉన్నారా అనే విషయం పక్కన పెడితే మీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పిన తర్వాత సినిమా చేయడానికి తాను ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ప్రశాంత్ నీల్ తనను ఒక చిన్న పిల్ల లాగా ట్రీట్ చేశారని, తాను ఎన్నో విషయాలలో ప్రశాంత్ నీల్ కి అడ్డంపడేదాన్ని కానీ ప్రశాంత్ మాత్రం అన్ని తనను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి చేసేవాడని ఆమె చెప్పుకొచ్చారు. తనను పొగరు సినిమాలో చూసి ప్రశాంత్ నీల్ గుర్తు పెట్టుకున్నాడని, ఈ పాత్రకు నన్ను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేదని ఆయన చెప్పాడు అని ఆమె అన్నారు.