NTV Telugu Site icon

Sri Vishnu: ప్రేమించిన అమ్మాయితో రాఖీ కట్టించుకోవడం ఏంటి బ్రో…

Sri Vishnu

Sri Vishnu

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శ్రీ విష్ణు, మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించిన శ్రీ విష్ణు, ఇప్పుడు ఫ్లాప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు. గత అయిదారు సినిమాలుగా శ్రీ విష్ణు ప్రేక్షకులని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకునే కథల్లో మాస్ ఎలిమెంట్స్ కోసం ట్రై చెయ్యడమే శ్రీ విష్ణు ఫ్లాప్స్ కి కారణం అయ్యింది. ఈ విషయం రియలైజ్ అయినట్లు ఉన్నాడు, శ్రీ విష్ణు ఈసారి తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యామిలీ, ఫన్, లవ్, ఎంటర్తైన్మెంట్ లాంటి అంశాలు ఉన్న కథని ఎంచుకోని ‘సామజవరగమనా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్తైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సామజవరగమన’ సినిమాలో బిగిల్ మూవీలో యాసిడ్ పడిన ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబా జాన్ హీరోయిన్ గా నటిస్తోంది.

రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి గతంలో శ్రీవిష్ణు పుట్టిన రోజు సంధర్భంగా మేకర్స్, గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమించుకున్న ప్రతి ఒక్కరికీ కాస్ట్ ప్రాబ్లమ్స్, లేదా మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నాకేంటి ఈ సమస్య వచ్చింది అంటూ శ్రీవిష్ణు తనదైన యాసలో డైలాగ్ చెప్పిన విధానం నవ్వించింది. గ్లిమ్ప్స్ లో శ్రీ విష్ణుకి ఎదో ప్రాబ్లమ్ ఉంది అనే హింట్ ఇస్తూ ఆడియన్స్ లో మంచి క్యురియాసిటీ క్రియేట్ చేశారు. ఈ క్యురియాసిటిని మరింత పెంచుతూ మేకర్స్ సామజవరగమనా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం 11:07 నిమిషాలకి AMB సినిమాస్ లో ఈ టీజర్ లాంచ్ జరగింది. టీజర్ లో శ్రీ విష్ణు చాలా జోష్ ఫుల్ గా కనిపించాడు. టీజర్ లో ఫన్ బాగానే వర్కౌట్ అయ్యింది. ప్రేమించిన అమ్మాయితో రాఖి కట్టించుకునే అలవాటు చిన్నప్పటి నుంచి ఉన్న శ్రీ విష్ణు అసలు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే మే 18న సామజవరగమనా సినిమా రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.