Sreeleela dismisses marriage reports with Nandamuri Mokshagna Teja: హీరోయిన్ల పెళ్లి అనేది నెవర్ ఎండింగ్ గాసిప్ మెటీరియల్. నిజానికి గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్‌పై పెళ్లి పుకార్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఇలాంటి పుకార్లను పదే పదే ఖండిస్తూ వచ్చినా ఎదో ఒక సమయంలో అవి మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న నటి శ్రీ లీలను ఈ గాసిప్ రాయుళ్లు టార్గెట్ చేశారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి శ్రీలీల ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేయగా అది రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేయగా ఆ ఈవెంట్ లో శ్రీలీలతో తాను హీరోగా నటిస్తానంటే మోక్షజ్ఞ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అడిగాడని బాలకృష్ణ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. మరోపక్క భగవంత్ కేసరి టీంతో కలిసి బాలయ్య, శ్రీలీల ఉన్న ఫొటోలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా కనిపించడం దానికి తోడు శ్రీలీల పక్కనే మోక్షు ఉండడంతో వీళ్ళిద్దరికీ పెళ్లయిపోతున్నట్లు రూమర్లు పుట్టించేస్తున్నారు.
Tollywood Releases: ఈ వారం 13 సినిమాలు.. ఏమేం రిలీజ్ అవుతున్నాయంటే?
నిజానికి ఒక్క ఫొటోను చూసి పెళ్లి గురించి ఊహాగానాలు పుట్టించడం ఏమాత్రం అభినందనీయం కాదు. వాస్తవానికి మోక్షును త్వరలో హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఓ వైపు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద దృష్టిపెడుతూనే సినిమాల మేకింగ్ మీద కూడా అవగాహన పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ‘భగవంత్ కేసరి’ టీంతో అసోసియేట్ అయిన క్రమంలో టీంతో కలిసి ఫొటోల్లో కనిపిస్తున్నాడు. ఆ మాత్రానికే శ్రీలీలను అతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు పుట్టించడం హాట్ టాపిక్ అయింది. ఈ వార్తల మీద శ్రీలీల టీమ్ స్పందించింది, ఇలాంటి బాధ్యతారహిత జర్నలిజాన్ని చూసి శ్రీలీల ఆశ్చర్యపోయిందని పేర్కొంటూ ఒక నోట్ రిలీజ్ చేసి ఆమె ఈ వార్తలు ను తప్పు అని కొట్టిపారేసిందని వెల్లడించింది. బాలయ్య సినిమాలో శ్రీ లీల ఆయనకు కుమార్తెగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.