Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందనే వాదనలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ టైమ్ లో పాకిస్థాన్ కు సంబంధించిన చాలా విషయాలపై చర్చ జరుగుతోంది. ఇదే టైమ్ లో సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ సినిమానే అబిర్ గులాల్. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇందులో పాకిస్థానీ నటుడు ఫవర్ ఖాన్ హీరోగా చేస్తుండగా.. వాణి కపూర్ అందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్తి ఎస్ బాగ్ది డైరెక్ట్ చేసిన ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇది బాలీవుడ్ సినిమాగా రాబోతోంది. కానీ పాకిస్థానీ నటుడు ఉన్నందున వద్దనే వాదనలు ఎక్కువయ్యాయి.
Read Also: Retro : సూర్య కౌంట్‌డౌన్ స్టార్ట్..
ఫవర్ ఖాన్ గతంలో 2014లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. అతను ఉండేది పాకిస్థాన్ లోనే. కానీ ఇక్కడ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఏడెనిమిది సినిమాలు బాలీవుడ్ లో చేశాడు. ఇప్పుడుచాలా రోజుల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ ఆయన సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయొద్దంటూ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. మన ఇండియాలోనే బోలెడంత మంది హీరోలు ఉన్నారు. పక్క దేశం వాడు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ కు సంబంధించిన ఎవరైనా సరే ఇండియాలో వారికి ఎంట్రీ ఉండొద్దు అంటున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. చూడాలి మరి ఈ మూవీని రిలీజ్ చేస్తారా.. ఆపేస్తారా అనేది.
