Skanda Pre Release Business: బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్ అనే క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాసా చిట్టూరి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన స్కంద ఆల్బమ్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్ గా నిలవగా స్కంద టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
2024 Oscars: బ్రేకింగ్ – ఆస్కార్స్‌కు మలయాళ సూపర్ హిట్ సినిమా ‘2018’
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది అనే వివరాల్లోకి వెళదాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘స్కంద’ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగుంది. సుమారు 43 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. నైజాంలో ‘స్కంద’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా సుమారు 14 కోట్ల రూపాయలు రాగా ఆంధ్రా ఏరియా అంతా కలిపి 20 కోట్లు, సీడెడ్ 9 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి 3 కోట్లు అంటున్నారు. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 2.20 కోట్లు రాగా మొత్తమ్మీద ‘స్కంద’ సినిమాకు 49 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. అలా 50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
