NTV Telugu Site icon

Skanda: డాన్స్ తో దిమ్మతిరిగే బొమ్మ చూపించారు…

Skanda

Skanda

ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. రామ్ పోతినేని పర్ఫెక్ట్ బోయపాటి హీరోలా మారిపోయి కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను, రామ్ పోతినేనిలతో ఇప్పటికే వర్క్ చేసి సూపర్బ్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్, మరోసారి స్కంద మూవీకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చినట్లు ఉన్నాడు.

స్కంద మూవీ నుంచి “నీ చుట్టూ చుట్టూ” సాంగ్ బయటకి వచ్చింది. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని, శ్రీలీలలు ఒక సాంగ్ లో డాన్స్ చేస్తున్నారు అంటేనే అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఆ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా థమన్ థంపింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. రఘురామ్ రాసిన లిరిక్స్, సిద్ శ్రీరామ్-సంజన వోకల్స్ ‘నీ చుట్టూ చుట్టూ’ సాంగ్ ని స్పెషల్ గా మార్చాయి. ఈ సాంగ్ ని క్రేజీ డాన్స్ నంబర్ గా మార్చాడు ప్రేమ్ ర్కష్టి మాస్టర్. ధమాకా సినిమాలో తన డాన్స్ తో యూత్ ని మాయ చేసిన శ్రీలీలా మరోసారి రెచ్చిపోయి డాన్స్ చేసినట్లు ఉంది. లిరికల్ వీడియోలోనే ఇలా ఉంటే ఇద్దరు టెర్రిఫిక్ డాన్సర్స్ కలిసి డాన్స్ తో దిమ్మతిరిగే బొమ్మ చూపిస్తే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు.

Show comments